టీటీడీకి రూ.10 లక్షల విరాళం
NEWS Oct 23,2026 10:00 pm
హైదరాబాద్కు చెందిన భక్తుడు పి. వీరేంద్రబాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన డీడీని ఆయనకు అందజేశారు. ప్రాణదాన ట్రస్టు ద్వారా అందించే వైద్య సేవలకు ఈ విరాళం ఉపయోగపడనుంది.