భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు
NEWS Oct 23,2026 10:22 am
రానున్న 6 నెలల్లో సూపర్ ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల ప్రభావంతో నిత్యావసర సరుకులు, బియ్యం ధరలు పెరిగే అవకాశముందని, ప్రజలు ముందుగానే అప్రమత్తమై నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచిస్తున్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుంటూ ఆర్థికంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఆందోళనతో నిత్యావసర సరుకులను అధికంగా నిల్వ చేయకుండా, పరిస్థితులను గమనిస్తూ సమతుల్యంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.