హరియాణాలోని పల్వల్ జిల్లా హథీన్‌లో 30 మందికి పైగా స్థానికులను కరిచి, ప్రజల్లో భయాందోళనలు రేపిన కోతి పట్టుబడింది. ఈ కోతిని పట్టుకున్నవారికి తన సొంత నిధుల నుంచి ₹ 51,000 నగదు బహుమతి అందజేస్తానని హథీన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ రేణులత ప్రకటించారు. కోతిని చేజిక్కించుకున్న వ్యక్తి దాని చేతులు కట్టేసి తన భుజాలపై మోస్తూ పట్టణ వీధుల గుండా తీసుకువెళుతుండగా వెనుక నడుస్తూ వచ్చిన జనం కర్రలతో మర్కటంపై దాడి చేసి కొట్టారు.