డీఆర్డీఏలో రూ.39 లక్షల లంచం
NEWS Oct 23,2026 09:56 am
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. పీఎం కృషి సించాయ్ యోజన పనులకు సంబంధించి అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని ఓ కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంలో టెక్నికల్ అధికారి రాజు, ప్రాజెక్ట్ అధికారి సతీష్ రెడ్డి రూ.39 లక్షల లంచం తీసుకున్నట్లు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.