ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా సూచించారు. క్యూవీఎస్‌ఈ యాప్ ద్వారా ఆన్లైన్ పెట్టుబడుల మోసాలు జరుగుతున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. రూ.54 వేల పెట్టుబడిపై రోజుకు ఒక శాతం లాభంతో పాటు రిఫరల్స్ ద్వారా అదనపు ఆదాయం వస్తుందని ఆశ చూపుతున్నట్లు వివరించారు. తెలంగాణలో ఇప్పటికే ఈ తరహా మోసాలకు సంబంధించి 56 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.