మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులుపేట మండలం పెద్దనాగారం సమీపంలో పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కలకలం రేపింది. గ్రామస్తుల సమాచారంతో గురువారం అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులను విచారించగా పులి సంచారం వదంతి అని తేలింది. ఇద్దరు మైనర్ యువకులు కృత్రిమ మేధస్సుతో పులి ఫొటోలు సృష్టించి వాటిని గ్రూపుల్లో షేర్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పులి సంచారం లేదని తేలడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.