పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయం
NEWS Oct 23,2026 09:59 am
పండుగ సాయన్న ధైర్యసాహసాలు ఎంతో గొప్పవని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు పలువురు ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పండుగ సాయన్న ఎంతో పోరాటం చేశారని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, ప్రజల కోసం చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.