గిద్దలూరులో మారిన మున్సిపల్ రాజకీయం
NEWS Oct 23,2026 10:00 am
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ తన నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి, టీడీపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి డాక్టర్ జె.వి. నారాయణ మధ్య పోటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ స్థానికంగా జోరందుకుంది.