మైసూరు దసరా ఉత్సవాల్లో CM రేవంత్
NEWS Oct 21,2026 09:58 pm
కర్ణాటకలో వైభవంగా నిర్వహించిన మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక సీఎం ఆహ్వానం మేరకు మైసూరుకు వెళ్లిన ఆయన, జంబూ సవారీలో బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. జంబూ సవారీలో జానపద కళాకారులు, సంగీత, నృత్య బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను రేవంత్ ఇతర ప్రముఖులతో కలిసి వీక్షించారు.