అమరుడి కుటుంబానికి పోలీసుల భరోసా
NEWS Oct 21,2026 09:19 pm
కొండేపి (మం) పెరిదేపిలో బలిమెల ఘటనలో అమరుడైన కానిస్టేబుల్ మోటా ఆంజనేయులు విగ్రహానికి కొండేపి సీఐ వైవీ రమణయ్య, ఎస్‌ఐ త్యాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ రమణయ్య మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆంజనేయులు పోలీసు శాఖ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.