అమరవీరుల సేవలు చిరస్మరణీయం
NEWS Oct 21,2026 09:14 pm
మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ మీనా కుమార్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.