గిద్దలూరు (మం)లో 47 పోలింగ్ కేంద్రాలు
NEWS Oct 20,2026 04:23 pm
గిద్దలూరు: మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 40,195 మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.