గిద్దలూరులో వైసీపీ ప్రచారం షురూ
NEWS Oct 20,2026 04:21 pm
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ‘మన ఊరు.. మన గిద్దలూరు.. మన అభివృద్ధి’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. చైర్మన్ అభ్యర్థితో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు తెలపాలని ఓటర్లను కోరుతున్నారు. గిద్దలూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.