గోదావరి పుష్కరాలకు ₹1000 కోట్లు!
NEWS Oct 20,2026 09:49 am
తెలంగాణలో 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. తొలుత రూ.6 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించగా, సాంకేతిక కమిటీ రూ.1,819 కోట్ల అంచనాలను సమర్పించింది. పరిశీలన అనంతరం శాశ్వత పనుల వ్యయాన్ని పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.900 కోట్ల విలువైన శాశ్వత పనులకు ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.