రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ కలయిక
NEWS Oct 20,2026 09:41 am
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ చైర్మన్ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ కిషోర్‌రెడ్డి నామినేషన్ల పరిశీలన కోసం అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులైన ఇద్దరూ ఒకే చోట కూర్చుని ఆత్మీయంగా పలకరించుకోవడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఎన్నికల పోటీలో వేర్వేరు పార్టీలకు చెందినప్పటికీ, వ్యక్తిగతంగా ఆప్యాయంగా కలుసుకున్న ఈ సన్నివేశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.