గిద్దలూరులో నామినేషన్ల పరిశీలన పూర్తి
NEWS Oct 20,2026 09:40 am
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. చైర్మన్ పదవికి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అన్నీ ఆమోదం పొందాయి. అలాగే 28 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా 123 మంది నామినేషన్లు వేయగా, వాటన్నింటినీ అధికారులు ఆమోదించారు. నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో తదుపరి దశగా ఉపసంహరణ ప్రక్రియపై దృష్టి నెలకొంది. ఉపసంహరణ గడువులో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకుంటారో, చివరికి ఎన్నికల బరిలో ఎంతమంది మిగులుతారో వేచి చూడాలి.