కొత్త రాజకీయ వేదికగా లాల్ హిట్ పార్టీ
NEWS Oct 19,2026 09:21 pm
ఢిల్లీలో లాల్ హిట్ జనతా పార్టీ (LJP) పేరిట కొత్త వేదిక ఏర్పాటైంది. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యమని పార్టీ అధినేత అయాన్ భట్నాగర్ తెలిపారు. సీజేపీ, కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలపై ఆయన విమర్శలు చేశారు. నిరసనల వల్ల రాజ్యాంగ సంస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని, వ్యాపారాలకు నష్టం కలుగుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాకే పరిమితం కాకుండా నిరసనలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దసరా నుంచి సీజేపీ పతనం ప్రారంభమవుతుందని చెప్పారు.