ఏపీలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్
NEWS Oct 19,2026 09:12 pm
APలో 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న తుది అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. నవంబర్ 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైన చోట్ల 4న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించారు.