నివేదిక: పాకిస్థాన్లో ఆకలి కేకలు
NEWS Oct 19,2026 03:11 pm
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది. ఆర్థిక ఒత్తిళ్లు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సహాయం తగ్గడం వంటి కారణాలతో అక్కడ ఆహార అభద్రత తీవ్రతరమవుతోందని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లో 26.6 కోట్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారని పేర్కొంది. పాకిస్థాన్లోని 51 గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1.06 కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ధరల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదలతో ప్రజల కొనుగోలు సామర్థ్యం దెబ్బతింటోంది.