మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
NEWS Oct 18,2026 09:09 pm
మార్కాపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి పూల సుబ్బయ్య కాలనీ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని పోలీసులు కోరారు.