సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి
NEWS Oct 18,2026 03:14 pm
కథలాపూర్: మండల కేంద్రానికి చెందిన పుండ్రా జగన్రెడ్డి (38) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్న ఆయన, పండుగ సందర్భంగా ఈ నెల 17న స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం ఇంటి వద్ద అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పండుగ వేళ జగన్రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖం వ్యక్తం చేశారు.