BJP అభ్యర్థిగా జేవీ నారాయణ నామినేషన్
NEWS Oct 18,2026 08:43 pm
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు.