దొడ్ల పాలలో డిటర్జెంట్ ఆనవాళ్లు
NEWS Oct 18,2026 10:38 am
తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్ లేదా కాస్టిక్ సోడా ఉన్నట్లు FSSAI వెల్లడించింది. కంపెనీ ప్లాంట్ నుంచి సేకరించిన ఫుల్ క్రీమ్ పాల నమూనా పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. అప్పీల్ అనంతరం రిఫరల్ ల్యాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లోనూ పాలు వినియోగానికి పనికిరావని నివేదిక వచ్చింది. ప్రియాగోల్డ్ బిస్కెట్ల తయారీలో పశువుల దాణాకు ఉపయోగించే తవుడు వినియోగించినట్లు గుర్తించడంతో సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో సంస్థపై చర్యలు ప్రారంభించారు. UEIR ఆర్గానిక్ ఫుడ్స్ ఎండుద్రాక్షలో పురుగుమందుల అవశేషాలు గుర్తించడంతో ఆ సంస్థపైనా చట్టపరమైన చర్యలు చేపట్టారు.