మిథున్ రెడ్డిపై A1గా 4 కేసులు
NEWS Oct 18,2026 09:31 am
పుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి రాజంపేట YCP ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నింటిలోనూ ఆయనను ప్రధాన నిందితుడిగా ఎ-1గా పేర్కొన్నారు. టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్, సుహేల్ బాషా, మోహన్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, దాడులు, వాహనాలతో దూసుకెళ్లడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.