సీఐ ఆస్తులు రూ.20 కోట్లపైనే!
NEWS Oct 18,2026 09:27 am
HYD: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర మాజీ CI అరకపల్లి ఆంజనేయులుకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇళ్లు, స్థలాలు, బంగారం తదితర ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2.28 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.20 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. ఎల్బీనగర్ పరిసరాల్లో 540 చదరపు గజాల స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. శనివారం 4 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారం, వాహనం, ఇతర వస్తువులు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.