చిరుజల్లుల్లో వైభవంగా శ్రీవారి గరుడసేవ
NEWS Oct 17,2026 08:12 pm
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు శుక్రవారం రాత్రి గరుడసేవ వైభవంగా జరిగింది. చిరుజల్లుల మధ్య లక్ష్మీకాసుల మాలధారిగా గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. రాత్రి 6.30 గంటలకు ప్రారంభమైన వాహనసేవ నాలుగు మాడ వీధుల్లో సాగింది. వర్షపు జల్లులను సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.