గిద్దలూరులో నేడు నామినేషన్ల సందడి
NEWS Oct 17,2026 08:11 pm
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో రెండో రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు సైతం శనివారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల కదలికలు, పార్టీల వ్యూహాలతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.