శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్రెడ్డి అన్నారు. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను వైఎస్ జగన్ అడ్డుకున్నారని ఆరోపించారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు బీసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలిపారు.