ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుక
NEWS Oct 02,2026 02:48 pm
మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శాస్త్రి యువజన సంఘం ఆధ్వర్యంలో మెట్‌పల్లి పట్టణంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మొత్తం 100 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు సంఘం అధ్యక్షుడు కోట గంగాధర్ బహుమతులు అందజేశారు. సంఘం సభ్యులు వేముల కిషన్, శికారి రాము, వేముల దయాకర్, బొమ్మకంటి గోపి, వెంకటరమణ, వేముల ప్రభాకర్, కేదారినాథ్, అఖిల్, హర్షిత్, మహేష్, వినయ్, నితిన్, ప్రభాకర్, సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.