ఒకేసారి 6 భాషల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్లు
NEWS Jul 20,2026 04:06 pm
బిగ్‌బాస్ అభిమానులకు జియోస్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని జియోస్టార్ ప్రకటించింది. హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్, బెంగాలీకి సౌరవ్ గంగూలీ హోస్ట్ గా వ్యవహారిస్తారు.
ఈ సందర్భంగా బిగ్‌బాస్ ప్రయాణం, ప్రేక్షకాదరణ, సాంస్కృతిక ప్రభావం, బ్రాండ్‌లకు ఈ షో అందించిన అవకాశాలపై ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ పేరుతో జియోస్టార్ ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్‌ను కూడా విడుదల చేసింది.
గత రెండు దశాబ్దాలుగా బిగ్‌బాస్ ప్రతి సీజన్‌తో మరింత ప్రజాదరణ పొందుతోందని జియోస్టార్ ప్రతినిధులు తెలిపారు.