ఏపీలో కరోనా - నలుగురు మృతి
NEWS Jul 17,2026 01:16 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3, విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో నలుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. మిగిలిన బాధితుల్లో ముగ్గురు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.