వర్షపు నీరు నిల్వకుండా చర్యలు..
సర్పంచ్ స్వప్న చొరవ
NEWS Jul 12,2026 12:42 pm
పినపా: భూపాలపట్నం గ్రామంలో రహదారులపై వర్షపు నీరు నిల్వకుండా సర్పంచ్ స్వప్న ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్న ఆమె, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.