చిన్నారులకు ఉచిత డ్రెస్సుల పంపిణీ
NEWS Jul 03,2026 09:36 pm
రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఉచిత డ్రెస్సులు పంపిణీ చేయడంతో పాటు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ బండారి మానస ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపసర్పంచ్ భూక్యా శంకర్, వార్డు సభ్యురాలు సమతా రమేష్, గ్రామ కార్యదర్శి సాయికృష్ణ, సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్ జల ,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.