ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం
మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
NEWS Feb 16,2026 06:39 pm
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్ గ్రామంతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ అంటూ భక్తుల నినాదాలతో ప్రాంతమంతా మారుమోగింది. ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు.