భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై ఆయన 608 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కార్పొరేటర్ విజయం సాధించడంతో డివిజన్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.