యూట్యూబ్ యూజర్లందరికీ AI ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వీడియోలను 27 భాషల్లో ఆటోమేటిక్‌గా డబ్ చేసి చూడవచ్చు. ‘ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్’ అప్‌డేట్‌తో డబ్ చేసిన వాయిస్ మరింత సహజంగా వినిపిస్తుంది. డబ్బింగ్‌కు అనుగుణంగా పెదాల కదలికలు మార్చే లిప్ సింక్ ఫీచర్‌పై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపు అన్ని కంటెంట్‌కు ఇది వర్తిస్తుంది. వీక్షకులు తమకు నచ్చిన భాషను ఎంచుకునే అవకాశం ఉంది.