టికెట్ రాలేదంటూ కన్నీటి పర్యంతం
NEWS Feb 03,2026 02:24 pm
మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో తనకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని మెట్‌పల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత కన్నీటి పర్యంతమైంది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఓదార్చింది. ఉదయం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య ఫోన్ చేసి బీ ఫామ్ తీసుకెళ్లామని చెప్పి, ఇప్పుడు లిస్ట్‌లో పేరు లేదనటం ఎంత వరకు సమంజసం అని కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై జువ్వాడి నర్సింగరావును అడుగగా తానేం చేయలేనని చేతులేత్తేశారంటూ రోదించింది. ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ఎంతో కృషి చేశానని కన్నీరు పెట్టుకున్నారు.