బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆయన బీజేపీ చీఫ్ రామచందర్ రావుతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఆగస్టు 11వ తేదీన తన అనుచరులతో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అచ్చంపేటలో మాజీ ఎంపీ రాములు, తన తనయుడు భరత్ కూడా బీజేపీలో కొనసాగుతున్నారు.