తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్ రామకృష్ణా రావు పదవీ కాలం మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణా రావు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన పదవీకాలం పొడిగించడానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో సీఎస్ గా కొనసాగే ఛాన్స్ దక్కింది. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాశారు.