త్వరలో నన్ను అరెస్ట్ చేయొచ్చు
NEWS Jun 16,2025 12:13 pm
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇది మూడోసారి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలన చేతకాక తమను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. అయినా తమకు అరెస్ట్ లు, కేసులు కొత్త కాదన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలపై నిలదీస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు.