సర్కార్ ఇచ్చే అవార్డులకు ముందుండాలి
NEWS Jun 15,2025 06:22 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డు వస్తోందంటే దాన్ని స్వీకరించడం గ్రహీతల బాధ్యత అని స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా అవార్డు ఇచ్చే సమయానికి అందుబాటులో ఉండాలన్నారు. త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులను ప్రకటిస్తుందన్నారు. టాలీవుడ్ కు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అని స్పష్టం చేశారు.