ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే ఛాన్స్
NEWS Jun 15,2025 12:58 pm
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. కర్ణాటక నుంచి మరఠ్వాడ మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దక్షిణ బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని కారణంగా ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఎవరూ బయటకు రావద్దని సూచించింది.