ఇరాన్ పై ట్రంప్ పోస్ట్ వైరల్
NEWS Jun 13,2025 08:40 am
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు కొన్ని గంటల ముందు ట్రంప్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ప్రారంభించామని, అణు స్థావరాలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహు. కాగా ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులు కోవాలంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ హతమయ్యారు. ఆ దేశం ధ్రువీకరించింది.