బీజేపీ పట్టణ కార్యదర్శుల నియామకం
NEWS Jun 12,2025 07:35 pm
ఎల్లారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కుచులకంటి, శంకర్ నాయి నియామకం అయ్యారు. కార్యకర్త స్థాయి నుంచి ఐదేళ్లుగా బీజేవైఎం పట్టణ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి నేడు పట్టణ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించినందుకు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులుకి, మండల అధ్యక్షులు పెద్దోండ్ల నర్సింలు, పట్టణ అధ్యక్షులు రాజేష్ కి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.