రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారంపై స్పందించారు డీసీపీ శ్రీనివాస్. గీత దాటితే చర్యలు తప్పవన్నారు. అర్థరాత్రి ఫోన్ కాల్ రావడంతో త్రిపురా రిసార్ట్ కు డ్రగ్స్ కిట్లతో వెళ్లామన్నారు. ప్రతి ఒక్కరికీ డ్రగ్స్ టెస్ట్ చేశామన్నారు. ఒక్క దామోదర్ రెడ్డి మినహా అందరికీ నెగటివ్ వచ్చిందన్నారు. అయితే మంగ్లీ పుట్టిన రోజు ఈవెంట్ కు సంబంధించి పర్మిషణ్ తీసుకోలేదన్నారు.