వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం
NEWS Jun 11,2025 01:51 pm
తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జ్యేష్ట మాసం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించారు.