నారాయణ కుటుంబానికి హర్షసాయి చేయూత
NEWS Jun 11,2025 11:34 am
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనకాపల్లి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ "ఐ లవ్ అనకాపల్లి" పేజీ క్రియేటర్ యెన్నేటి నారాయణ రావు కుటుంబాన్ని యూట్యూబర్ హర్షసాయి పరామర్శించారు. అనకాపల్లి దాసరి గెడ్డ రోడ్డు, పల్లపు వీధి బంగ్లాకు చెందిన నారాయణ రావు సోషల్ మీడియాలో ఐ లవ్ అనకాపల్లి పేజీతో అనకాపల్లి జిల్లా విశేషాలు, ప్రత్యేకతలు, పండగలు పోస్టులు చేస్తూ తక్కువ సమయంలోనే 1,50,000 మంది ఫాలోవర్లతో చాలా మంది అభిమానం సంపాదించుకున్నారని అన్నారు. చిన్న వయసులోనే రోడ్డుప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని అతని కుటుంబానికి లక్ష 50 వేలు సాయం చేశారు.