బాబు..బాలయ్య..లోకేష్ క్షమాపణ చెప్పాలి
NEWS Jun 10,2025 02:22 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సంచలన ఆరోపణలు చేశారు. ఆడవాళ్లు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని మాట్లాడిన బాలకృష్ణ సారీ చెప్పాలన్నారు. కోడలు మగ బిడ్డను కంటే అత్త సంతోషించదా అని మాట్లాడి ఆడవారి పుట్టుకనే అవమానించిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు. తన కూతుర్లను చూసేందుకు జగన్ లండన్ వెళ్తే నీచంగా మాట్లాడిన లోకేష్ సారీ చెప్పాలన్నారు. తనను దారుణంగా తిట్టిన బండారు సత్యనారాయణ, తిట్టించిన సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.