ఇండియన్ స్టూడెంట్‌పై యుఎస్ పోలీస్ దౌర్జన్యం
NEWS Jun 10,2025 11:31 am
అమెరికాలో భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ ఇండియన్ స్టూడెంట్ ను అత్యంత కిరాతకంగా కొట్టారు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో. చేతులకు సంకెళ్లు వేసి, తలను నేలకు అదిమిపట్టి విద్యార్థిని తీవ్రంగా కొట్టారు. వలసదారుల తరలింపులో భాగంగా విద్యార్థిని బలవంతంగా పంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కునాల్ జైన్ అనే సోషల్ ఆంత్రపెన్యూర్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.