కస్టడీలో మాజీ మంత్రి కాకాణి విచారణ
NEWS Jun 08,2025 07:30 am
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. 22 ప్రశ్నలు అడిగితే కేవలం రెండు, మూడింటికే సమాధానం ఇచ్చారు. మైనింగ్ వ్యవహారంలో కాకాణి వ్యవహారంపై ఆరా తీశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, తనకు ఏ పాపం తెలియదని పేర్కొన్నారు కాకాణి. కూటమి సర్కార్ కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు.